లోక్‌సభ ఎన్నికల్లో 400 కాదు.. కనీసం 200సీట్లు గెలిచి చూపించాలని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) బీజేపీ (BJP)కి సవాల్ చేశారు. ఆదివారం బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అయితే, 400కి పైగా సీట్లను సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి టార్గెట్‌గా పెట్టుకుంది.
మరోవైపు బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని తాను అనుమతించబోమని మమత స్పష్టం చేశారు. సీఏఏ కోసం దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారుతామనీ.. అందుకోసం దరఖాస్తు చేసుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీఏఏ చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చడానికి అది ఒక ఉచ్చు అని తెలిపారు. వెస్ట్ బెంగాల్‌లో సీఏఏని, ఎన్ఆర్సీని అనుమతించబోమని దీదీ స్పష్టం చేశారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200లకు పైగా సీట్లు సాధిస్తామని బీజీపీ తెలిపిందని గుర్తు చేశారు. అయితే, 77 వద్దే ఆగిపోయారని ఆమె ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో కనీసం 200 స్థానాలల్లో గెలిచి చూపించాలని బీజేపీకి సవాల్ చేశారు మమతా బెనర్జీ. అయితే, స్వతహాగా బీజేపీ 370 స్థానాలను సాధించాలని టార్గెట్‌గా పెట్టకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ లక్ష్యాన్ని విమర్శిస్తూ.. దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీజేపీతో కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని ఆమె ఆరోపించారు.