Telugu News » Katarnak thief : లేడీ గెటప్ లో…చోరీ చేసిన కేటుగాడు..!

Katarnak thief : లేడీ గెటప్ లో…చోరీ చేసిన కేటుగాడు..!

ఈజీ మనీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువత.అడ్డ దారిలో సంపాదించిన సొమ్ముతో జల్సాచేస్తున్నారు.

by sai krishna

ఈజీ మనీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువత.అడ్డ దారిలో సంపాదించిన సొమ్ముతో జల్సాచేస్తున్నారు. చేసిందంతా చేసి అమాయకులుగా నటిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన తాజాగా ఘటన పోలీసులు సైతం షాకయ్యేలా చేసింది.


వివరాల్లోకి వెళితే..రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District)ఎల్లారెడ్డిపేట మండల(Ellareddypet Mandal) కేంద్రంలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషధారణ ధరించి తన భవనంలోని దుకాణంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు.

భార్యకు సంబంధించిన సవరం, అమె డ్రెస్ ధరించి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేశాడు. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రామిండ్ల నాంపల్లికి చెందిన భవనంలో మండలంలోని సింగారం గ్రామంలోని గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు.

11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది. కౌంటరులోని రూ.3500 నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రమాకాంత్(SI Ramakant) ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

అనంతరం పలు వివరాలు సేకరించి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అయితే, ముందు దొంగతనానికి పాల్పడినది యువతిగా భావించారు. అనుమానం వచ్చిన పోలీసులు రామిండ్ల సుధీర్ అదుపులోకి తీసుకుని తమదైన విచారించారు.

తానే తన భార్య సవరంతో పాటు, దుస్తులు ధరించి దొంగతనానికి పాల్పడ్డానని అంగీకరించాడు. కేసు నమోదు చేసి రామిండ్ల సుధీర్ ను రిమాండ్ కు తరలించామని ఎస్ఐ రమాకాంత్ వివరించారు.

You may also like

Leave a Comment