Telugu News » Mangalyaan-2: మంగళ్‌యాన్-2కు సన్నాహాలు.. తేలనున్న అంగారకుడి రహస్యాలు..!!

Mangalyaan-2: మంగళ్‌యాన్-2కు సన్నాహాలు.. తేలనున్న అంగారకుడి రహస్యాలు..!!

ఇప్పటి వరకు చంద్రుడు, సూర్యుడిపై తన ప్రయోగాలను చేసిన ఇస్రో ఈసారి అంగారకుడిపై దృష్టి పెట్టింది. అక్కడి రహస్యాలను తేల్చేందుకు ఇస్రో సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు మంగళయాన్-2(Mangalyaan-2)  పై దృష్టి సారించారు.

by Mano
Mangalyaan-2: Preparations for Mangalyaan-2.. Secrets of floating Mars..!!

చంద్రయాన్‌-3(Chandrayaan-3), ఆదిత్య-ఎల్1(Aditya L1)లను నింగిలోకి విజయవంతం పంపి భారత్ సత్తా ఏంటో చూపించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు చంద్రుడు, సూర్యుడిపై తన ప్రయోగాలను చేసిన ఇస్రో ఈసారి అంగారకుడిపై దృష్టి పెట్టింది. అక్కడి రహస్యాలను తేల్చేందుకు ఇస్రో సన్నాహాలను ముమ్మరం చేసింది.

Mangalyaan-2: Preparations for Mangalyaan-2.. Secrets of floating Mars..!!

ఇస్రో శాస్త్రవేత్తల దృష్టి భారతదేశం మొట్టమొదటి మానవ సహిత మిషన్ అయిన గగన్‌యాన్ పైనే ఉంది. ఇందుకోసం అంగారకుడి రహస్యాలను అన్వేషించేందుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు మంగళయాన్-2(Mangalyaan-2)  పై దృష్టి సారించారు. ఇస్రో 2024లో ఈ మిషన్‌ ప్రయోగించనుంది. ఇప్పటికే చంద్రయాన్-3 శస్త్రవేత్తలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.  ప్రస్తుతం సూర్యుని L1 పాయింటికి ప్రయాణంలో ఉంది. గగన్‌యాన్ మిషన్ టెస్టింగ్ కూడా దాదాపు పూర్తయింది.

భారతదేశం మార్స్ ఆర్బిటర్ మిషన్-2ని ప్రారంభించనుంది, ఇది మార్స్ వాతావరణాన్ని దాని కక్ష్య నుంచి అధ్యయనం చేస్తుంది. అనంతరం ఆ సమాచారాన్ని ఇస్రోకు అందించనుంది. మంగళయాన్-2తో నాలుగు పేలోడ్‌లు అంగారకుడిపై ఎగురుతున్న ధూళిని అధ్యయనం చేసే మార్స్ ఆర్బిట్ డస్ట్ ఎక్స్పరిమెంట్ (మోడెక్స్)తో సహా మంగళయాన్-2 మిషన్‌తో నాలుగు పేలోడ్లు పంపిస్తారు.

ఇది కాకుండా, దాని అయస్కాంత లేదా గురుత్వాకర్షణ లక్షణాల గురించి సమాచారాన్ని అందించే ఎనర్జిటిక్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (EIS) కూడా ఉంటుంది. మూడవ పేలోడ్ రేడియో అక్యుల్టేషన్ (RO) దాని వాతావరణం గురించి సమాచారాన్ని అందిస్తుంది. నాల్గవ పేలోడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ (LPEX). ఇది అంగారక గ్రహాన్ని చిత్రీకరించే అధిక రిజల్యూషన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.

ఆర్బిటర్ మిషన్-2కు ముందు 2014లో భారతదేశం ప్రయోగించిన మంగళయాన్-1 విజయవంతమైంది. మంగళయాన్-1 భారత్ మొదటి మిషన్.   పీఎస్ఎల్పీ నుంచి ప్రయోగించిన ఇది అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. మంగళయాన్‌ను అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ కావడం విశేషం. ఇప్పుడు భారత్ మంగళ్‌యాన్‌-2 మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది.

 

You may also like

Leave a Comment