మణిపూర్(Manipur)లో హింసాత్మక ఘటనలు ఆగడంలేదు. తాజా అక్కడ ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ దాడిలో 128 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన నరన్సేన ప్రాంతంలో కుకీ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లోని నరన్సేన ప్రాంతంలో తెల్లవారుజామున 2:15 గంటల మధ్య ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు(Manipur Police) ధ్రువీకరించారు. ఈ సైనికులు రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా(Bishnupur District)లోని నరన్సేన(Naransena) ప్రాంతంలో మోహరించారు.
మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన కుల హింస అంతం కావడం లేదు. దాదాపు ఏడాది కాలంగా చెదురుమదురు హింసాకాండలో మణిపూర్ రగిలిపోతోంది. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు.
దాడుల్లో అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జీవనం సాగించలేక చాలా మంది వలసబాట పడుతున్నారు. మే 2023 నుంచి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి నుంచి తరచూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉగ్రదాడితో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.