Telugu News » Manish Sisodia: మనీష్ సిసోడియాకు ఉపశమనం.. భార్యను కలుసుకునేందుకు కోర్టు అనుమతి..!

Manish Sisodia: మనీష్ సిసోడియాకు ఉపశమనం.. భార్యను కలుసుకునేందుకు కోర్టు అనుమతి..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam)లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రోజ్ అవెన్యూ కోర్టు(Rose Avenue court) కోర్టు కాస్త ఉపశమనాన్ని కల్పించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలుసుకునేందుకు అనుమతించింది.

by Mano
Manish Sisodia: Relief for Manish Sisodia.. Court permission to meet his wife..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam)లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రోజ్ అవెన్యూ కోర్టు(Rose Avenue court) కోర్టు కాస్త ఉపశమనాన్ని కల్పించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలుసుకునేందుకు అనుమతించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో కలిసేందుకు కోర్టు అనుమతి కల్పించింది.

Manish Sisodia: Relief for Manish Sisodia.. Court permission to meet his wife..!

కోర్టు అనుమతించిన ఈ సమయంలో సిసోడియాకు ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని, రాజకీయ ప్రసంగం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఉపశమనం కల్పిస్తూనే హైకోర్టు విధించిన తరహా ఆంక్షలు విధిస్తామని కోర్టు తెలిపింది. శుక్రవారం విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ వ్యతిరేకించినా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చింది.

కస్టడీలో ఉన్న తన భార్యను 5 రోజుల పాటు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఏప్రిల్ 25 న అతని భార్య మల్టిపుల్ స్క్లెరోసిస్‌ అనే మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ విషయం ఇప్పటికే రికార్డులో ఉందని, ఆమె గత 20 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతోందని కోర్టు పేర్కొంది.

ఈ సమయంలో సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు వివరిస్తూ.. తన భార్యను ఒకరోజు కలిసేందుకు హైకోర్టు కూడా అనుమతించిందని తెలిపారు. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ అక్టోబరు 30న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మార్చి 9న ఈడీ తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి సిసోడియా రెండు కేసుల్లో జైలులో ఉన్నారు.

You may also like

Leave a Comment