Telugu News » Mansukh Mandaviya : ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..!!

Mansukh Mandaviya : ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..!!

దేశం అంతా 3 నుంచీ 4 లక్షలు టెలి కన్సల్టేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

by Venu

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి (Health Minister) మన్సుఖ్ మాండవీయ నేడు విజయవాడ, గుంటూరు (Guntur) జిల్లాల్లో పర్యటించారు. గుంటూరు, మామిళ్లపల్లిలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను పరిశీలించిన ఆరోగ్యశాఖ మంత్రి.. అనంతరం మంగళగిరి ఎయిమ్స్ సందర్శించారు.ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 10 రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

మరోవైపు విజయవాడ (Vijayawada) ఓల్డ్ జీజీహెచ్ లో, క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) శంకుస్థాపన చేశారు. కేవలం ఆసుపత్రులు ఉంటే సరిపోదని అందులో డాక్టర్లు కూడా ఉండాలని తెలిపిన మాండవీయ.. అందుకే మెడికల్ కాలేజీలు సైతం తీసుకొచ్చామని వెల్లడించారు. దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో 107,000 సీట్లు ఉన్నాయని అన్నారు..

దేశం అంతా 3 నుంచీ 4 లక్షలు టెలి కన్సల్టేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఏపీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ చాలా బాగా పని చేస్తోందని మన్సుఖ్ మాండవీయ వివరించారు.. రాష్ట్ర మంత్రి విడుదల రజనీ మంచి పనులు చేయడానికి నా వద్దకు వస్తారని మన్సుఖ్ మాండవీయ అన్నారు..

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్ధాయి మద్దతు ఉంటుందని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు..ఆరోగ్య సేవలకు చేసే ఖర్చుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడదని మన్సుఖ్ మాండవీయ తెలిపారు.. అన్ని రాష్ట్రాలు బాగుండాలని ఆశించే వ్యక్తి మన ప్రధాని అని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment