తెలంగాణ (Telangana)లో నేడు మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో భద్రాద్రి (Bhadradri) జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో దండకారణ్యాన్ని భద్రత బలగాలతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరోవైపు మావోయిస్టులు (Maoists) దండకారణ్యంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో హింసా, విధ్వంసాలకు పాల్పడుతోన్నారు..
ఇందులో భాగంగా.. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సుక్మా జిల్లాలో మూడు వాహనాలను తగులబెట్టారు. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని పందిగూడా-అసర్గూడ మార్గమధ్యంలో ఒక బస్సు, ఒక టిప్పర్, ఒక కారును మావోయిస్టులు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా.. భద్రాద్రి కొత్తగూడెంలో సెల్‌టవర్‌ను సైతం తగులబెట్టారు. దుమ్ముగూడెం మండలం, పైడిగూడెం గ్రామంలో ఉన్న సెల్ టవర్‌కు మావోయిస్టులు నిప్పుబెట్టారు.
ఇదే సమయంలో కమలాపురంతో పాటు, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెలిశాయి. మరోవైపు ఈ విధ్వంసాల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లిల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కాగా మావోయిస్టుల హింసతో ప్రజలు భయపడుతున్నారు.
ఇప్పటికే అల్లూరి జిల్లాలో రోడ్డు మీద కారుని తగులబెట్టిన మావోయిస్టులు. ఉపా కేసులు రద్దు చేయాలనీ, NIA దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు ఎన్కౌంటర్లు లేని సమాజం కావాలంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్లు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. మరోవైపు భద్రాచలం ఏజన్సీ ఏరియా వరుస విధ్వంస ఘటనలతో నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు..