Telugu News » Maoist Arrest: మావోయిస్టు నేత సంజయ్‌ దీపక్‌రావు అరెస్ట్‌

Maoist Arrest: మావోయిస్టు నేత సంజయ్‌ దీపక్‌రావు అరెస్ట్‌

ఇతని దగ్గరి నుంచి ఒక పిస్టల్, ఆరు రౌండ్స్ బుల్లెట్స్, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

by Prasanna

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌రావును (Sanjay Deepak Rao) అరెస్ట్ చేశామని తెలంగాణ (Telangana) డీజీపీ (DGP) అంజనీకుమార్ తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రైజంక్షన్‌, పశ్చిమ ఘాట్‌ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్న దీపక్‌ను హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతని దగ్గరి నుంచి ఒక పిస్టల్, ఆరు రౌండ్స్ బుల్లెట్స్, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

దీపక్ రావు మీద మహారాష్ట్ర పోలీసులు 25 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. NIA, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా దీపక్ రావు ఉన్నాడన్నారు.  మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌కు చెందిన దీపక్‌రావు.. కేరళలో దీపక్ రావును అలియాస్ అనిల్‌, వికాస్‌ పేర్లతో పిలుస్తుంటారని సమాచారం.

గతంలో రెండుసార్లు ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకూ వెళ్లొచ్చాడు. చాలా కాలం మహారాష్ట్రలో పనిచేసిన దీపక్ రావు 2019లో పాలకాడ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్‌ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తూ వస్తున్నాడు. దీపక్‌రావు భార్యను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

You may also like

Leave a Comment