Telugu News » IPS : తెలంగాణలో 26 మంది ఐపీఎస్‌ల బదిలీ…..!

IPS : తెలంగాణలో 26 మంది ఐపీఎస్‌ల బదిలీ…..!

ఆ తర్వాత మరి కొద్ది సేపటికే ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 26 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ (Transfer)చేసింది.

by Ramu
mass transfers of ips in telangana

తెలంగాణలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మొదట 26 మంది ఐఏఎస్ (IAS) అధికారులను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత మరి కొద్ది సేపటికే ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 26 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ (Transfer)చేసింది.

mass transfers of ips in telangana

తెలగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌ను టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా నియమించింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న గజరావ్ భూపాల్ ను డీఐజీ కో ఆర్డినేషన్ గా, రెమా రాజేశ్వరిని మహిళా భద్రతా విభాగం డీఐజీగా, రామగుండం కమిషనర్ గా ఎల్ఎస్ చౌహన్, జోయెల్ డేవిస్ ను జోగులాంబ గద్వాలకు డీఐపీగా బదిలీ చేసింది.

విష్ణు ఎస్ వారియర్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. పీవీ పద్మజను మల్కాజ్ గిరి డీసీపీగా, నిర్మల్ ఎస్పీగా డాక్టర్ జానకీ షర్మిల, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా ధరావాత్ జానకి, ఖమ్మం కమిషనర్ గా సునీల్ దత్, సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, డీ. ఉదయ్ కుమార్ ను ట్రాన్స్ కో సూపరింటెండెంట్ గా, ఆదిలాబాద్ ఎస్పీగా నియమించింది.

మాదాపూర్ డీపీసీగా వినిత్‌, ములుగు ఎస్పీగా శబరీష్, మేడ్చల్ డీసీపీగా నితికాపంత్, సిద్దిపేట ఎస్పీగా బి. అనురాధ, ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్ రాజును, మెదక్ ఎస్పీగా బాలస్వామి, జయశంకర్ జిల్లా ఓఎస్డీగా అశోక్ కుమార్, హైద్రాబాద్ ట్రాఫిక్ -3 డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లు, రాజేంద్ర నగర్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాసులను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

You may also like

Leave a Comment