మెక్కికో(Maxico)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ స్టేట్ హిడాల్(Central state Hidal)లో రోడ్డు ప్రాజెక్టు 50 అడుగుల (14 మీటర్లు) స్కాఫోల్డింగ్ కూలిపోయింది. ఈ భారీ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
రోడ్డు ప్రాజెక్టు పనుల్లో కార్మికులు శనివారం హైవే రిటైనింగ్ వాల్‌లా కనిపించే భారీ నిర్మాణానికి సిమెంట్ పోస్తుండగా.. ఫారాలు, పరంజా కూలిపోయింది. దీంతో ఐరన్, తడి సిమెంట్‌లో కార్మికులు చిక్కుకుపోయి దుర్మరణం చెందారు.
ఇటీవలే మెక్సికోలోని తమౌలిపాస్‌లో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 2న ఓ చర్చి పైకప్పు కూలి ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. చర్చి పైకప్పు కూలిపోయినప్పుడు సుమారు 100 మంది అక్కడ పనిలో ఉన్నారు. ఇక బాప్టిజం జరుగుతున్న సమయంలో ప్రమాదం వాటిల్లింది. ఆ ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోరం జరిగింది.
తాజాగా జరిగిన టవర్ ప్రమాదంలో శిథిలాల కింద ఇంకా కొంత మంది కార్మికులు ఉన్నారని వారిని రక్షిస్తున్నామని రవాణా శాఖ వెల్లడించింది. కాగా ఈ టవర్ నిర్మాణం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్మిస్తుండటంతో టవర్ నిర్మాణంలో ఎదైనా నాణ్యత లోపించిందా? అనేదానిపై విచారణ చేపట్టినట్లు రవాణ శాఖ మంత్రి తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.