మాంసాహార ప్రియులకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మహావీర్ జయంతి(Mahavir Jayanti) సందర్భంగా ఈనెల 21న(ఆదివారం) హైదరాబాద్(Hyderabad)లోని మటన్ దుకాణాల(Meat Shops) తో పాటు కబేళాలు, మాంసం, బీఫ్ మార్కెట్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(Ronald Rose) ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నాన్వెజ్ షాపు(nonveg shop)లను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, జైనులు మహావీర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జైనులు జరుపుకునే పండుగలలో.. మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైనది.
అహింసను ప్రబోధించిన జైనమత(Jainism) ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నిర్వహించడం ఆనవాయితీ. బీహార్లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీస్తు పూర్వం 599లో క్షత్రియ కుటుంబంలో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు.. 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడిగా మారారు.
ఈ నేపథ్యంలో రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. ఎవరైనా ఆదివారం నిబంధనలు ఉల్లంఘించి నాన్ వెజ్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వుల అమలులో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం యథావిధిగా మటన్, చికెన్ షాపులు తెరుచుకోవచ్చని కమిషనర్ చెప్పారు.