Telugu News » Medak : కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం.. స్పీకర్​ వరకు వెళ్లనున్న ఫిర్యాదు..!!

Medak : కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం.. స్పీకర్​ వరకు వెళ్లనున్న ఫిర్యాదు..!!

అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఆగ్రహించిన సునీత రెడ్డి.. ప్రోటోకాల్ మార్చారా అంటూ అదనపు కలెక్టర్​ను నిలదీశారు. ఈ నియోజక వర్గ ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇవ్వవలసిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు.

by Venu
brs congress

మెదక్ (Medak)జిల్లా నర్సాపూర్​ (Narsapur)లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభోత్సవం వివాదానికి దారితీసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే సునీత రెడ్డి (MLA Sunitha Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభోత్సవానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని అధికారులపై మండిపడ్డారు..

అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఆగ్రహించిన సునీత రెడ్డి.. ప్రోటోకాల్ మార్చారా అంటూ అదనపు కలెక్టర్​ను నిలదీశారు. ఈ నియోజక వర్గ ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇవ్వవలసిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు.. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు. ముందు మీరు ప్రోటోకాల్ గురించి తెలుసుకొండని విమర్శించారు..

దీంతో కాంగ్రెస్ (Congress)..బీఆర్ఎస్ (BRS) శ్రేణుల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు ఇవాళ జరిగిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చి ప్రోటోకాల్ (Protocol) పాటించలేదని ఎమ్మెల్యే సునీత రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై శాసనసభలో స్పీకర్​కు, ప్రోటోకాల్ వయోలెన్స్ కింద ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు..

You may also like

Leave a Comment