Telugu News » Raghunandan : అహంకారాన్ని చంకలో పెట్టుకుని తిరుగుతున్న హరీష్ రావు..!?

Raghunandan : అహంకారాన్ని చంకలో పెట్టుకుని తిరుగుతున్న హరీష్ రావు..!?

హంకారాన్ని చంకలో పెట్టుకుని తిరుగుతున్న హరీష్ రావు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్లమెంట్ లో అప్పటి టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని.. నేటి బీఆర్ఎస్ కు కూడా ఆ ఇద్దరు మాత్రమే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రఘునందన్ ఎద్దేవా చేశారు..

by Venu
raghunandan-rao

తెలంగాణ (Telangana)లో నామినేషన్ల అంకం నేటితో ముగిసింది. రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. మరోవైపు ప్రచార పర్వంలో నేతలు తమ నోటికి పని కల్పించారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో తరచుగా నేతలు ప్రచారంలో మాట్లాడిన మాటలు వివాదస్పందంగా మారడం కనిపిస్తూనే ఉంది. ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు (Harish-Rao) దుబ్బాక (Dubbaka) నియోజకవర్గం పర్యటనలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

raghunandan-rao

ఈ కామెంట్స్ పై దుబ్బాక బీజేపీ (BJP) అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకులు ఒకటి రెండు సీట్లు గెలిస్తే ఏం పని చేస్తారని హరీష్ రావు మాట్లాడటం ఆయన ఆహకార ధోరణికి నిదర్శనం అని మండిపడ్డారు. సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా హాజరైన రఘునందన్ రావు.. మంత్రి హరీష్ రావు పై పలు విమర్శలు చేశారు.

అహంకారాన్ని చంకలో పెట్టుకుని తిరుగుతున్న హరీష్ రావు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్లమెంట్ లో అప్పటి టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని.. నేటి బీఆర్ఎస్ కు కూడా ఆ ఇద్దరు మాత్రమే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రఘునందన్ ఎద్దేవా చేశారు..

మరోవైపు 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం నేడు 3 వందల పై చిలుకు ఎంపీ సీట్లకు చేరుకుందన్న విషయం యాది తెచ్చుకో అని రఘునందన్ తెలిపారు.. దొరల అహంకార పురిత మాటలను తెలంగాణ సమాజం క్షమించదని.. తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా ఎదురుచూస్తున్నారని రఘునందన్ విమర్శించారు. కాగా సిద్దిపేట జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలు బీజేపీకి వస్తాయని.. బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమవుతుందని ధీమా వ్యక్తం చేశారు..

మరోవైపు తన ఆప్తమిత్రుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతన్ని వెంటనే హైదరాబాదు ప్రైవేట్ ఆస్పత్రిలో దగ్గరుండి ఆరోగ్యశాఖ మంత్రి అడ్మిట్ చేయించడం ఆశ్చర్యకరం అని రఘునందన్ అన్నారు.. ప్రభుత్వంలోని మంత్రులకే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేదని హరీష్ రావు రుజువు చేశారన్న రఘునందన్.. తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండని తెలిపారు..

You may also like

Leave a Comment