Telugu News » Medaram Jathara: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు..!

Medaram Jathara: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు..!

రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క - సారక్క జాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది.

by Mano
Medaram Jathara: Central government's key announcement.. Special trains for Medaram Jathara..!

తెలంగాణ(Telangana)లో మహాజాతరకు సమయం ఆసన్నమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క – సారక్క జాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 21న మేడారం జాతర(Medaram Jathara) ప్రారంభం కానుండగా 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపుతున్నట్లు వెల్లడించింది.

Medaram Jathara: Central government's key announcement.. Special trains for Medaram Jathara..!

ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలిపారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు అందించనుందని వెల్లడించారు.

సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని తెలిపారు. బెల్లంపల్లి, మంచిర్యాల, జమ్మికుంట, భువనగిరి, జనగాం, రామగుండం, పెద్దపల్లి, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు ప్రాంతాలకు చెందిన వారికి ఉపయోగపడనున్నయని తెలిపారు.

సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07017/07018), సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ మధ్య (07014/07015) నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (7019/07020) రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. గిరిజన వర్గాల సంక్షేమానికి పాటుపడతామని ఆయన అన్నారు.

You may also like

Leave a Comment