కాళేశ్వరం (Kaleshwaram)పై కాంగ్రెస్ (Congress) సర్కారు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం అవినీతి పై విభిన్నంగా హస్తం నేతలు ప్రచారం నిర్వహించారు.. బీఆర్ఎస్ అవినీతిని ఆయుధంగా మలచుకొని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదీగాక కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు ఋజువులు కూడా చూపిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం అవినీతిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జలసౌధలో, ఆ శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు నిర్వహించారు.. పలు విషయాలపై కూపీలాగినట్టు సమాచారం.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల్లో జరిగిన అవకతవకలు, నష్టాలపై విచారణ జరిపిస్తామని ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు.
కాగా మేడిగడ్డ (Madigadda) ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిన ఉత్తమ్.. ఒక పిల్లర్ 1.2 మీటర్లు మేర కుంగిందని.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని పేర్కొన్నారు.. ఈ అంశంపై త్వరలో విచారణకు ఆదేశిస్తామని వెల్లడించిన ఉత్తమ్.. తప్పు చేసిన వారు తప్పించకోలేరని అన్నారు.. ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు గత ప్రభుత్వంలో వచ్చాయని.. నిజాలు తేల్చి చర్యలు తీసుకొనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు..
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మేడిగడ్డ ఘటన చాలా సీరియస్ ఇష్యూ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. అధికారులతో తెప్పించుకుంటున్నామని.. తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం.. మేడిగడ్డకు ఎప్పుడు వెళ్లాలనే దానిపై నిర్ణయం ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.. ఈ స్కామ్ లో ఉన్న ఎవరిని అంత తేలికగా వదిలిపెట్టమని గుర్తు చేశారు..