నిహారిక (Niharika).. మెగా డాటర్ కూతురిగా అందరికి సూపరిచితమే.. కాగా ఇండస్ట్రీకి యాంకర్ (Anchor) గా పరిచయం అయ్యి అనంతరం హీరోయిన్ (Heroine) గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు సినిమాల్లో నటించిన నటిగా పెద్ద సక్సెస్ అందుకోలేక పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా వివాహం చేశారు.
నిహారిక చేసినవి అతి తక్కువ సినిమాలు అయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం బాగా సంపాదించుకొన్నారు. ఎప్పుడైతే తన భర్త వెంకట చైతన్యకు (Chaitanya) విడాకులు ఇచ్చారో అప్పటినుంచి నిహారిక ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా వెంకటచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఆ అమ్మాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నిహారికకి తన మాజీ భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అనే విషయం తెలిసి.. సోషల్ మీడియా (Social media)లో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. కారులో ప్రయాణిస్తూ 7/G బృందావన్ కాలనీ సినిమాలోని కన్నుల బాసలు తెలియవులే అనే పాటను ప్లే చేస్తూ వచ్చిన వీడియో వైరల్ గా మారింది.
అంతే కాకుండా సాంగ్ ఆఫ్ ద డే అంటూ పోస్ట్ కూడా చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నిహారిక మాజీ భర్త పెళ్లి చేసుకుంటున్నారనే విషయం తెలిసి ఇలా ఫీల్ అవుతోందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.