పార్లమెంట్ లో ఏలియన్లను (Aliens) ప్రదర్శించారు. అయితే ఇది మన దేశ పార్లమెంట్ (Parliament) లో కాదు. మెక్సికో పార్లమెంట్ లో. మెక్సికో పార్లమెంట్ (Mexico) లో ఏలియన్లను ప్రదర్శించారు. జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఏలియన్ అవశేషాలను పార్లమెంట్ లో సభ్యులకు చూపించారు. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను మెక్సికో పార్లమెంట్లో తెరిచి చూపించారు.
వంకర తలతో, కుచించుకోపోయిన శరీరంతో ఉన్నఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏళ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ చెప్పారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని….డయాటమ్ గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని తెలిపారు.
అవి అచ్చం గ్రహాంతర వాసుల ఆకారానే పోలి ఉండటం సంచలనమైంది. ఏలియన్స్ గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న జెయిమ్…వింత ఆకారంలో ఉన్న మృతదేహాలపైనా అధ్యయనం చేశారు. సాధారణ మనుషులతో పోల్చి చూస్తే ఈ బాడీస్‌లోని జెనెటిక్ కంపోజిషన్ 30% విభిన్నంగా ఉందని తేల్చి చెప్పారు. నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో…కార్బన్ డేటింగ్ ద్వారా ఈ విషయాలు వెల్లడించింది. వీటికి కాళ్లకు, చేతులకు మూడు వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి వెయ్యి సంవత్సరాల క్రిత నాటివి అని కార్బన్ డేటింగ్‌లో తేలింది.
అయితే అది పూర్తిగా అవాస్తవమని మెక్సికోలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకురాలు జూలియాటా ఫియరో తేల్చారు. మానవులా? కాదా? అన్న విషయాన్ని నిర్ధరించడానికి ఎక్స్ కిరణాల కంటే అధునాతనమైన సాంకేతికత అవసరమని తెలిపారు.