Telugu News » Pakistan : పాపం పాకిస్థాన్‌.. చెరపకురా చెడేవు అంటే ఇదే కావచ్చు..?

Pakistan : పాపం పాకిస్థాన్‌.. చెరపకురా చెడేవు అంటే ఇదే కావచ్చు..?

వైమానిక స్థావరం లోపల భీకర పోరు జరుగుతున్నట్టు అక్కడ కనిపిస్తున్న భారీ మంటలు చూస్తే తెలుస్తుందని స్థానిక మీడియా చెబుతుంది. ఈ పోరులో ఇప్పటి వరకు ఒక దుండగుడు హతమైనట్టు సమాచారం. కాగా దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

by Venu

అణిచి వేస్తున్న కొద్ది ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటుంది. పాము తన పిల్లలను తానే మింగినట్లు.. పాకిస్థాన్‌ పెంచి పోషించిన ఉగ్రవాదం ఆ దేశానికే ప్రమాదంగా మారింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ (Pakistan)లో వరుసగా ఉగ్రదాడులు (Terrorist attacks) చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం పంజాబ్‌ ప్రావిన్స్‌ (Punjab Province)లోని మియన్వాలి (Mianwali) వైమానిక స్థావరం (Air Base)పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపారు.

ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడినట్లు ప్రాధమిక సమాచారం. కాగా ఈ పేలుళ్లు తమ పనిగా తెహ్రీక్-ఏ-జిహాద్ అనే ఉగ్ర సంస్థ ప్రకటించిందని స్థానిక మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. మరోవైపు వైమానిక స్థావరం లోపల భీకర పోరు జరుగుతున్నట్టు అక్కడ కనిపిస్తున్న భారీ మంటలు చూస్తే తెలుస్తుందని స్థానిక మీడియా చెబుతుంది. ఈ పోరులో ఇప్పటి వరకు ముగ్గురు దుండగులు హతమైనట్టు సమాచారం. కాగా దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇరువైపుల నుండి భారీ కాల్పులు జరుగుతున్నా.. ఇప్పటి వరకు పాక్ ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ పార్టీ మద్దతుదారులు ఎయిర్‌బేస్ వెలుపల ఉన్న విమాన నిర్మాణాన్ని కూడా తగులబెట్టారు. అంతకుముందు దార్‌లో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై దాడి చేశారు.

You may also like

Leave a Comment