రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar) కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పై విరుచుకుపడ్డారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెడుతుందని, కేసీఆర్ (KCR) పాలనలో సురక్షితంగా ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్, బీజేపీ పెద్దలకు అధికారం అప్పగిస్తే 50 ఏండ్లు పడ్డ అరిగోస మళ్లీ తప్పదని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ నాయకులకు అధికారం అప్పగిస్తే పచ్చగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని మంత్రి గంగుల అన్నారు. కాంగ్రెస్ ముసుగులో కేవీపీ, షర్మిల, బీజేపీ ముసుగులో మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి.. తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీలే అమలు చేయలేని కాంగ్రెస్ ను.. ఆరు గ్యారంటీలు కాదు ఆరు వేల గ్యారంటీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మరని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపించే ఓట్లు ఆడుగుతామని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తరువాత రెండో నగరంగా కరీంనగర్ మారిందని తెలిపారు.
ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రచారాల పనిలో బిజీ అవుతుండగా.. అక్టోబర్ 18 నుంచి భారీ ర్యాలీతో తాను కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని మంత్రి గంగుల కమాలాకర్ చెప్పారు.