Telugu News » Minister Komatireddy: ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం.. మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ..!

Minister Komatireddy: ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం.. మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ..!

ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఆయన దానిపై సమీక్ష నిర్వహించారు.

by Mano
Minister Komatireddy: Construction of Telangana Bhavan in Delhi.. Minister Komatireddy Clarity..!

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి (Minister) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఆయన దానిపై సమీక్ష నిర్వహించారు.

Minister Komatireddy: Construction of Telangana Bhavan in Delhi.. Minister Komatireddy Clarity..!

అనంతరం ఉమ్మడి ఏపీ భవన్‌లోని పలు బ్లాక్‌లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలను, తెలంగాణకు రావాల్సిన వాటాను అధికారులు మ్యాప్ ద్వారా వివరించారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన 19 ఎకరాలను పరిశీలించానని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత మోడీపై ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఉన్న మంత్రిని ఏపీ ప్రత్యేక హోదా జేఏసీ సభ్యులు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా సహకరించాలని వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కోమటిరెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చెప్పారని గుర్తు చేశారు.

ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్న మంత్రి ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదని స్పష్టం చేశారు. 58:42 రేషియోలో పంపకాలు ఉంటాయని వెల్లడించారు. డిజైన్లు, ఖరారు చేసి టెండర్లు పిలిచి ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని హైదరాబాద్ వెళ్లాక సీఎంతో చర్చిస్తానన్నారు.

You may also like

Leave a Comment