Telugu News » KTR : కేటీఆర్ కార్యక్రమంలో టెన్షన్ టెన్షన్

KTR : కేటీఆర్ కార్యక్రమంలో టెన్షన్ టెన్షన్

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌ గా ఉందన్నారు. అలాగే, ఐటీ, అగ్రికల్చర్‌ లో అగ్ర భాగంలో ఉన్నామని చెప్పారు. పల్లె ప్రగతిలో దేశంలో 30 శాతం అవార్డులు తెలంగాణ గెలుచుకోవడం గర్వకారణమన్న ఆయన.. వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్లు కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని ఎద్దేవ చేశారు.

by admin
Minister KTR At Bhupalpally

– భూపాలపల్లి కలెక్టరేట్ ప్రారంభం
– ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి..
– ప్రారంభించిన మంత్రి కేటీఆర్
– తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌
– పల్లె ప్రగతిలో దేశంలో 30 శాతం అవార్డులు మనవే
– దేశానికి ఆర్థిక చేయూత అందించడంలో
– 4వ స్థానంలో ఉన్నామన్న కేటీఆర్

భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్ (KTR). జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్న, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి (Madhusudanachari), ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (Venkata Ramana Reddy), ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ (Telangana) అభివృద్ధి గురించి వివరించారు.

Minister KTR At Bhupalpally

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌ గా ఉందన్నారు. అలాగే, ఐటీ, అగ్రికల్చర్‌ లో అగ్ర భాగంలో ఉన్నామని చెప్పారు. పల్లె ప్రగతిలో దేశంలో 30 శాతం అవార్డులు తెలంగాణ గెలుచుకోవడం గర్వకారణమన్న ఆయన.. వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్లు కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని ఎద్దేవ చేశారు. దేశంలో భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ రాష్ట్రంగా తెలంగాణ ఉందని పేర్కొన్నారు.

దేశానికి ఆర్థిక చేయూతను అందించడంలో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్న కేటీఆర్.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10వ స్థానంలో కూడా లేదని గుర్తు చేశారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

మరోవైపు, కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సిరికొండ ప్రశాంత్ అభిమానులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఛాంబర్ లోకి ప్రశాంత్ ని వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. నియోజకవర్గానికి సంబంధం లేని వారిని కలెక్టరేట్ లోకి రానిస్తున్నారు కానీ.. కలెక్టరేట్ కోసం పోరాడిన వారిని ఎందుకు రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత్ అభిమానులు.

You may also like

Leave a Comment