Telugu News » KTR : జుమ్లా బీజేపీ.. మరోసారి కేటీఆర్ ఆగ్రహం

KTR : జుమ్లా బీజేపీ.. మరోసారి కేటీఆర్ ఆగ్రహం

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ట్విట్టర్(ఎక్స్)లోనూ మండిపడ్డారు. బీజేపీ జుమ్లా పార్టీ అంటూ ఫైరయ్యారు.

by admin

తెలంగాణ (Telangana) లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది బీజేపీ (BJP). రాష్ట్రానికి కేంద్రం 9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. అభివృద్ధికి సహకరిస్తున్నా బీఆర్ఎస్ (BRS) తప్పుడు ప్రచారం చేస్తోందని అంటోంది. ఇదే క్రమంలో జాతీయ నేతలను వరుసగా రంగంలోకి దింపుతోంది. మొన్న ప్రధాని మోడీ (PM Modi) రెండు సార్లు వచ్చి.. బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు. తాజాగా ఆదిలాబాద్ వచ్చిన అమిత్ షా (Amit Shah) కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిసెంబర్ 3న కాషాయ జెండా ఎగరాలని.. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు.

మద్యం, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగంతో పాటు అవినీతి, అక్రమాల్లో కేసీఆర్‌ (KCR) తెలంగాణను నెంబర్‌ వన్‌ చేశారని అన్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎటాక్ మొదలుపెట్టారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ (KTR).. షా చెప్పినవన్నీ అబద్ధాలని ఖండించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ట్విట్టర్(ఎక్స్)లోనూ మండిపడ్డారు. బీజేపీ జుమ్లా పార్టీ అంటూ ఫైరయ్యారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని.. దేశంలోనే అతి తక్కువ రైతు ఆత్మహత్యలున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు కేటీఆర్. రైతు ఆత్మహత్యలకు సంబంధించిన న్యూస్ క్లిప్ ను కూడా పోస్ట్ చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే.. అబద్ధాలు చెబుతోంది అమిత్​ షా నా లేక.. ఎన్డీఏ ప్రభుత్వామా అంటూ ప్రశ్నించారు. బక్వాస్​ జూటా పార్టీ డీఎన్ఏ మొత్తం అబద్ధాలు, జుమ్లాలే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. ఎన్ని చేసినా తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్​ వెంటే ఉంటుందని అన్నారు.

రాష్ట్రానికి ఒక్క మంచి పని కూడా చేయని అమిత్ షా ప్రసంగాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు కేటీఆర్. ఎన్నికల వేళ బీజేపీ జుమ్లాలు, అబద్ధాలను విని దేశ ప్రజలు.. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారని.. ఇక వాటిని నమ్మే పరిస్థితి ఏ మాత్రం లేదన్నారు కేటీఆర్.

You may also like

Leave a Comment