Telugu News » KTR : అలవాటైన అబద్దాలతో ప్రజలకు వల వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది…..!

KTR : అలవాటైన అబద్దాలతో ప్రజలకు వల వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది…..!

తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా బీజేపీ చేయలేదన్నారు.

by Ramu

ఎన్నికల సమయంలో బీజేపీ (BJP) చెప్పే జుమ్లాలు, అబద్దాలను విని విని ఈ దేశ, తెలంగాణ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. దేశంలో బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఎన్ని అబద్ధాలు చెప్పినప్పిటకీ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మంచి గుణపాఠం చెబుతారని అన్నారు. అలవాటైన అబద్దాలతో మరో సారి వల వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

 

తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా బీజేపీ చేయలేదన్నారు. అలాంటి పార్టీ అడ్డగోలు ప్రచారం చేస్తుంటే అమిత్ షా ప్రసంగాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి బీజేపీ మాట్లాడితే మంచిదని అన్నారు. అమిత్ షాకు దమ్ముంటే అదాని గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు.

దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసందుకు అమిత్ షా చెప్పారన్నారు. తెలంగాణ స్ఫూర్తిగా రైతుబంధు కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఇప్పుడు పచ్చి అబద్దాలు ఆడారని మండిపడ్డారు. ఐదేండ్ల క్రితం అదిలాబాద్ లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని బీజేపీ విస్మరించిందన్నారు. చట్ట ప్రకారం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, వైద్య కళాశాల, యూనివర్సిటీ వరకు ఒక్క విద్యాసంస్థను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదన్నారు.

100 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలు మోడీ, అమిత్ షా అబద్ధాలకు ప్రభావితం కారని, బీజేపీకి తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం, తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచిలు ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు.

బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ముమ్మాటికి సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధాని, బీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదాని చేతిలో ఉందని విమర్శలు గుప్పించారు. బీజేపీకి, అమిత్ షాకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లో బీజేపీ ఏం చేసిందో ప్రజలకు వివరించాలన్నారు. ఆ తర్వాతే వారి మద్దతు కోరాలన్నారు. ఏం చేశామో చెప్పుకునే ధైర్యం లేకనే బీజేపీ ఇలా మత రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

You may also like

Leave a Comment