కేంద్ర ప్రభుత్వం పంపిన అలర్ట్ మెసేజ్ కాసేపు మంత్రి కేటీఆర్ (KTR) ను కంగారు పెట్టించింది. హైదరాబాద్ (Hyderabad) శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్ కు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. అయితే.. ఆయన మాట్లాడుతున్న సమయంలో సడెన్ గా అలారం సౌండ్ (Allert Message) వినిపించింది. ఫైర్ కు సంబంధించిన అలారమా అంటూ మాట్లాడారు కేటీఆర్.
కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. అక్కడున్న మొబైల్స్ కు ఒక్కసారిగా బీప్ సౌండ్ అలర్ట్ వచ్చింది. దీంతో ‘ఇది ఫైర్ అలారమేనా. మనం అందరం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? నాకు తెలిసి ఇది ఫైర్ అలారమే’ అని అన్నారు కేటీఆర్. స్పీకర్ సౌండ్ అని ఓ వ్యక్తి చెప్పగా.. ‘క్లోజ్డ్ ఆడిటోరియంలో ఉన్నాం గుడ్ లక్ గాయ్స్’ అని నవ్వులు పూయించారు.
దేశవ్యాప్తంగా గురువారం చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపింది. అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిపింది.
ఈ మెసేజ్ పై తెలంగాణ పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరు తమ మొబైల్ కి ఇలాంటి మెసేజ్ రావడం చూసే ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల సందర్భంలో పంపించే మెసేజ్ సిస్టమ్ ను కేంద్ర టెలికమ్యూనికేషన్ వారు శాంపిల్ గా పంపించారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.