Telugu News » Minister KTR: 11 సార్లు అవకాశమిస్తే ఏం చేశారు..? మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

Minister KTR: 11 సార్లు అవకాశమిస్తే ఏం చేశారు..? మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

‘‘ప్రతిపక్ష పార్టీలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి.. అని అడుగుతున్నాయి. వీళ్లకు ఎందుకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలి..? బోర్‌ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు?..’’ అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

by Mano
KTR

మంత్రి కేటీఆర్(Minister KTR) సంచనలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు 11సార్లు అవకాశమిస్తే ఏం చేశారు..? అంటూ ఆరోపించారు. తాజ్ డెక్కన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్‌(Telangana Builders Association) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

september 17 the national unity day will be celebrated by the brs

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి.. అని అడుగుతున్నాయి. వీళ్లకు ఎందుకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలి..? బోర్‌ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు?..’’ అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ఓఆర్ఆర్, త్రిపుల్ ఆర్ మధ్యలో కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. త్రిపుల్ ఆర్ బయట కూడా కొత్త రింగ్ రోడ్డు, తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గం సులభం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

ఇంతటి అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి? అంటూ కేటీఆర్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కర్ణాటకలో బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400కు పెరిగింది అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో అభివృద్ధి ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుంది అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి కొనసాగాలంటే కేసిఆర్ మళ్ళీ రావాలని అన్నారు.

You may also like

Leave a Comment