Telugu News » Minister Ponguleti: త్వరలో అర్హులైన పేదలకు ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Minister Ponguleti: త్వరలో అర్హులైన పేదలకు ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి శనివారం ఫణిగిరిగట్టు వద్ద ఉన్న హౌసింగ్ కాలనీని పరిశీలించారు.

by Mano
Minister Ponguleti: Homes for the deserving poor soon: Minister Ponguleti Srinivas Reddy

రాబోయే 3, 4 నెలలో అర్హులైన పేదలకు ఇళ్లను అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి శనివారం ఫణిగిరిగట్టు వద్ద ఉన్న హౌసింగ్ కాలనీని పరిశీలించారు.

Minister Ponguleti: Homes for the deserving poor soon: Minister Ponguleti Srinivas Reddy

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు చెబుతారని అన్నారు. హుజూర్ నగర్‌లో 2,100 ఇళ్లు పూర్తి చేసి త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితం అయిందని, హుజూర్ నగర్‌లో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు కట్టించిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ పనులు పెడింగ్‌లో ఉన్నాయని గత ప్రభుత్వం భూములను అన్యాక్రాంతం చేసిందని పొంగులేటి ధ్వజమెత్తారు. అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అవినీతి, దుర్మార్గ పాలన సాగిందని విమర్శించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, త్వరలోనే గ్యాస్ స్కీమ్‌ను అమలు చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖలో అనేక లోటుపాట్లు ఉన్నాయని, చెక్ డ్యామ్‌లపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆరోపించారు.

You may also like

Leave a Comment