Telugu News » RK Roja: కరప్షన్‌ కింగ్‌ చంద్రబాబు: మంత్రి రోజా!

RK Roja: కరప్షన్‌ కింగ్‌ చంద్రబాబు: మంత్రి రోజా!

చంద్రబాబుపై కక్ష సాధించే అవసరం తమకు లేదని రోజా చెప్పుకొచ్చారు.

by Sai
minister roja sensational comments on chandrababu

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పై మంత్రి రోజా (Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ కంపెనీలతో దోచుకున్న కరప్షన్ కింగ్ చంద్రబాబు అని భగ్గుమన్నారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB court) రిమాండ్ విధించడంపై స్పందిస్తూ.. రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

minister roja sensational comments on chandrababu

చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని రోజా చెప్పారు. తన అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు నాయుడేనని వెల్లడించారు. తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు చంద్రబాబును రిమాండ్‌కు పంపించిందని తెలిపారు.

చంద్రబాబుపై కక్ష సాధించే అవసరం తమకు లేదని రోజా చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరగలేదని.. తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలిగారా? అని రోజా ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిని వ్యక్తికి పవన్ మద్ధతిస్తున్నారని రోజా విమర్శించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని.. చంద్రసేనగా మార్చేశారని విమర్శించారు. పవన్ పవర్ స్టార్ కాదన్న రోజా.. ప్యాకేజ్ స్టార్ అని ఆరోపించారు. కేవలం ప్యాకేజీ కోసమే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్ధతు ఇచ్చారని వెల్లడించారు.

షెల్ కంపెనీల్లో పవన్ కూడా వాటా ఉన్నట్లు ఉందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ మాట్లాడడం నిజం కాదా? అని రోజా ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. రోజా తన అనుచరులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.

You may also like

Leave a Comment