గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండబోవని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu Duddilla) తెలిపారు. తాము ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ( Democratic Governament)నడుపుతామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
ఐటీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఆదివారం సొంత నియోజకవర్గానికి శ్రీధర్ బాబు చేరుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తుందన్నారు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏటా జబ్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పాలసీలు బాగుంటే వాటిని కూడా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు.