త్వరలో ఏఐ సిటీ(AI City) నిర్మించబోతున్నామని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Telangana IT Minister Sridhar babu) తెలిపారు. హైదరాబాద్‌లో జూన్ నెలలో ఏఐ సమ్మిట్(AI Summit) నిర్వహిస్తున్నామని ప్రపంచ శ్రేణి ఏఐ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామన్నారు.
మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ టెలిపర్ఫార్మెన్స్ ఇంప్రెసిన్ఎక్స్ పీరియన్స్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రేపటి(గురువారం) నుంచి బడ్జెట్ సెషన్ ఇండస్ట్రీ, ఇన్ ప్రా నిర్వహిస్తున్నామన్నారు. ఐటీ, స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నామన్నారు. 1990వ దశకంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు.
తర్వాత ఒక పార్టీ, మధ్యలో కాంగ్రెస్, 2014లో ఇంకో పార్టీ తర్వాత ఇప్పడు తాము అధికారంలో ఉన్నామన్నారు. అయినా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిందన్నారు. టెలిపర్ఫార్మెన్స్ డేనియల్ను భారత్‌కు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు అనుకూలంగా ఉన్న సిటీలను చూసి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని చెప్పానన్నారు. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీ అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉన్నందున ఇక్కడి నుంచి ఏ మెట్రోపాలిటన్ సిటీకి అయినా రెండు గంటల్లో వెళ్లొచ్చన్నారు. ఇక్కడ భూకంపలు రావని, ప్రకృతి విపత్తుల ప్రమాదం లేదన్నారు. ఇక్కడి అనుకూల వాతావరణం, మానవ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ కుటుంబానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉన్నారని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.
రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఐఎస్బీ తరహాలో ఇది స్కిల్డ్ మ్యాన్ పవర్ అందిస్తుందని తెలిపారు. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయి. తమ ప్రభుత్వం టూరిజంపైనా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. టూరిజం గ్రోత్ 20 శాతం పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.