తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav).. బీఆర్ఎస్ (BRS) పార్టీలో కీలక నేత. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రపీ శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇన్ని శాఖలను మెయింటెన్ చేయడం కష్టంగా మారిందో ఏమోగానీ.. కేటీఆర్ (KTR) ప్రోగ్రాంలో తెగ చిరాకుపడ్డారు. అదీ ఎంతవరకు అంటే.. పార్టీలో కీలక నేత కాలర్ పట్టుకునేంత. అవును.. మంత్రి తలసాని శ్రీనివాస్.. ఓ లీడర్ కాలర్ పట్టుకుని కొడుతున్నట్టు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
శనివారం అట్టహాసంగా హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. అయితే.. ఓ నేత కేటీఆర్ పక్కనే నడుస్తూ కనిపించారు. ఇది మంత్రి తలసానికి ఏమాత్రం నచ్చలేదు. నా ముందే నడుస్తావా అంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు.
కుక్క తోక వంకర అని ఊరికే అన్నరా? పార్టీ మారినంతమాత్రాన పుట్టుకతో వచ్చిన రౌడీ లక్షణాలు పోతాయా? నీ రౌడీ మొహంలో నా చెప్పు.. Shame on you Talasani Srinivas Yadav.
Shame on @KTRBRS for having this kind of asshole in the government. https://t.co/FXPmucvGv2
— K.K. (@kkxed) August 20, 2023
కేటీఆర్ నెనుక నడుస్తున్న సమయంలో తనకంటే ముందున్న లీడర్ కాలర్ పట్టుకుని లాగి చెంప దెబ్బ కొట్టారు తలసాని. అంతేకాదు, తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన.. బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ గా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే వాట్సాప్ లో బయటపెట్టారు. ఇది, మెల్లమెల్లగా ఇతర గ్రూపులకు చేరింది. తర్వాత సోషల్ మీడియాకు ఎక్కింది. దీంతో తలసానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.
BRS leader and Telangana state minister "Talasani Srinivas Yadav" slapped a man at an inauguration function held in the state.
They Are raised by public and this is their behavior towards public.
Having ministry in hand doesn't mean you can do anything.
Have Good behavior.#BRS pic.twitter.com/PtB0E0NyD3— OmPrakash (@im_omprakashh) August 20, 2023
సొంత పార్టీకి చెందిన నేతపై ఇలాగేనా ప్రవర్తించేది అని మంత్రిని నిలదీస్తున్నారు. కొందరైతే.. ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తలసాని టీడీపీలో ఉన్నారు. దాన్ని గుర్తు చేస్తూ.. స్వరాష్ట్రం కోసం ఉద్యమంలో పని చేయని తలసాని.. కేటీఆర్ సమక్షంలోనే సొంత పార్టీ నేతపై ఇలా దురుసుగా ప్రవర్తించారంటే.. ఎంతగా డామినేట్ చేస్తున్నారో అర్థం అవుతోందని కామెంట్స్ పెడుతున్నారు. బీఆర్ఎస్ ముమ్మాటికీ ఉద్యమ పార్టీ కాదని అంటున్నారు.