Telugu News » Malla Reddy : తగ్గేదేలే…. గోవాలో మల్లారెడ్డి జోష్ మాములుగా లేదు…!

Malla Reddy : తగ్గేదేలే…. గోవాలో మల్లారెడ్డి జోష్ మాములుగా లేదు…!

ఆయన ఎక్కడ ఉన్న తన చేష్టలు, డైలాగ్స్‌తో సందడి చేస్తారు. తన జోష్‌తో చుట్టు పక్కల ఉన్న వాళ్లలో ఉత్సహాన్ని నింపుతారు.

by Ramu
Mla Chamakura mallareddy is enjoying in goa

బీఆర్ఎస్ ఎమ్మెల్యే (MLA) చామకూర మల్లారెడ్డి (Malla Reddy) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ఎక్కడ ఉన్న తన చేష్టలు, డైలాగ్స్‌తో సందడి చేస్తారు. తన జోష్‌తో చుట్టు పక్కల ఉన్న వాళ్లలో ఉత్సహాన్ని నింపుతారు. ఇప్పటికీ ఆయన డైలాగులూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

Mla Chamakura mallareddy is enjoying in goa

తాజాగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవా ట్రిప్ వెళ్లారు. అక్కడ బీచ్‌లో కాసేపు రిలాక్స్ అయ్యారు. వాటర్ రైడ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. తానే స్వయంగా బోటు నడిపుతూ సరదాగా గడిపారు. కండ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బోట్ నడుపుతూ దుమ్ము రేపారు. ఆ తర్వాత పారా గ్లైడెంగ్ కూడా చేశారు.

అక్కడున్న తెలుగు టూరిస్టులతో జై మల్లన్న అనిపించుకున్నారు. తాజాగా తన గోవా టూర్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో మల్లా రెడ్డి షేర్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మల్లారెడ్డి జోష్ ను చూసి నెటిజన్లు వీడియోకు లైక్ లు కొడుతున్నారు.

ఆయనలో ఉత్సాహాన్ని చూసి తమ దైన శైలిలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మల్లారెడ్డి ఎక్కడా తగ్గడం లేదని అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన స్టైలే వేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మల్లన్న వీడియోలు చూసి చాలా ఎంటర్ టైన్మెంట్ అవుతోందని అంటున్నారు.

Mla Chamakura mallareddy is enjoying in goa

You may also like

Leave a Comment