Telugu News » Komati reddy Raj Gopal reddy : నల్గొండకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్, జగదీశ్ రెడ్డిలే….!

Komati reddy Raj Gopal reddy : నల్గొండకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్, జగదీశ్ రెడ్డిలే….!

కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకతీతంగా బహిష్కరించాలని కోమటి రెడ్డి కోరారు.

by Ramu
mla rajagopal reddy fires on brs over public meeting on feb 13

దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి.. ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు నల్గొండలో సభ పెడతామని కేసీఆర్ (KCR) అంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Raja Gopal Reddy) అన్నారు. కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకతీతంగా బహిష్కరించాలని కోమటి రెడ్డి కోరారు.

mla rajagopal reddy fires on brs over public meeting on feb 13

చండూరులో మీడియా సమావేశంలో కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ….కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారని, ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2014లో సీఎం హోదాలో ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును కుర్చి వేసుకుని పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఆ తర్వాత శివన్నగూడెం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని అన్నారు. కానీ ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కై నీళ్లను ఆంధ్రాకు తరలించేందుకు సహకరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేండ్ల తర్వాత ఏ మొహం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిలని ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు నల్గొండ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తామని సభ పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. హెడ్ వర్క్స్ టెండర్లు పిలవకుండానే రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ దే అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని..తాము ఇప్పుడు గాడిలో పెడుతున్నామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి నీళ్లు తీసుకురావాలనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు. ఆ ప్రాజెక్టులకు నీటిని నార్లాపూర్ నుండి తీసుకొస్తారా.. వట్టెం నుండి తీసుకొస్తారా.. ఇంతవరకు డిసైడ్ చేయలేదని ఫైర్ అయ్యారు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లను పిలిచి రైతులను భూ నిర్వాసితులను, పేదవాళ్లను ఆగం చేసి రిజర్వాయర్లను కట్టాడని ఆరోపించారు.

You may also like

Leave a Comment