బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్(Rekha Naik) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ(Party) మారలేదన్నారు. తాను ఇంకా బీఆర్ఎస్(Brs) ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పారు. పార్టీ కోసం తాను పన్నేండేండ్లుగా పని చేస్తున్నానని చెప్పారు. ఇక పై కూడా పార్టీ కోసమే పని చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. అభివృద్ధి పనుల కోసం నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారని వాపోయారు.
తన భర్త శ్యాం నాయక్ మాత్రమే పార్టీ మారారన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో పని చేశానన్నారు. తొమ్మిదేండ్లు ఎమ్మెల్యేగా వున్నాని అన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేశానన్నారు. అభ్యర్థి కోసం అభివృద్ధిని ఆపుతున్నారంటూ మండిపడ్డారు. అది సరైన పద్దతి కాదన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తన ధోరణిని మార్చుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగానే తన అల్లుడిని బదిలీ చేశారని ఆమె కంట తడి పెట్టారు. పార్టీలో తనకు అన్యాయం చేశారని వాపోయారు. ఇప్పుడు ఇది చాలదంటూ తన బిడ్డకు కూడా అన్యాయం చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ లో ఉన్నారని ఆమె అన్నారు.
అజయ్ కుమార్ తండ్రి సీపీఐలో కొనసాగడం లేదా అని ప్రశ్నించారు. తాను పార్టీ మారడం లేదని ఆమె తేల్చి చెప్పారు. అలాంటి ఉద్దేశమే తనకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.