దీపావళి పండుగకి ఇంకా సమయం ఉండగానే తెలంగాణ (Telangana)లో అప్పుడే దీపావళి జరుగుతుందా..! అనే అనుమానం ప్రజలకి కలుగుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే దీపావళి పటాసులు అయినా అంతలా పేలుతాయో లేదో తెలియదు కానీ రాష్ట్ర నేతల మాటలు మాత్రం తాడు బాంబుల కంటే ఎక్కువే మోగుతున్నాయని ఆశ్చర్య పోతున్నారు జనం.
ఇక బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavita).. కమలం, హస్తం నేతలపై విరుచుకు పడ్డారు.. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టే నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ (Congress) తెరలేపిందని కవిత మండిపడ్డారు.. రాహుల్ గాంధీ, రైతులకు మధ్య జరుగుతున్న ఎన్నికలలో.. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలో తెలుస్తుందని అన్నారు.
రైతుబంధు ఆపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతులు తగినబుద్ది చెప్తారని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎన్నికల కోడ్ పేరుతో ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందా..? అని మండిపడ్డారు కవిత.. బీజేపీ (BJP)ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు చేతల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్న కవిత ఆయనను కోరుట్లలో ఓడిస్తామని తేల్చిచెప్పారు.
మరోవైపు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్.. గజ్వేల్ నుంచి పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని కవిత స్పష్టం చేశారు.. కాంగ్రెస్ హామీ యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ హామీ మాత్రమే అని కవిత విమర్శించారు.