Telugu News » Kavitha : కార్మికుల గొంతుకైన టీబీజీకేఎస్ ను గెలిపించండి….!

Kavitha : కార్మికుల గొంతుకైన టీబీజీకేఎస్ ను గెలిపించండి….!

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని వెల్లడించారు.

by Ramu
mlc kavitha called for tbgks to win singareni elections

సింగరేణి సంస్థను కేసీఆర్ (KCR) కాపాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని వెల్లడించారు. కార్మికుల హక్కులను టీబీజీకేఎస్ సాధించిందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి టీబీజీకేఎస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు.

mlc kavitha called for tbgks to win singareni elections
కోల్ ఇండియా సంస్థలో కూడా లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి లాభాల్లో కార్మికులకు 18 శాతం వాటా ఉండేదన్నారు. కానీ దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 32 శాతానికి పెంచారని చెప్పారు.

కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించారని అన్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్ అమలు చేయడం, సొంత ఇంటిని నిర్మించుకునే వారికి రూ.10 లక్షల మేర రుణం వరకు సంస్థనే వడ్డీ భరించడం వంటి ఎన్నో విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని వివరించారు.

టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. కార్మికుల పక్షాన నిలబడే ఏకైక కార్మిక సంఘం టీబీజీకేఎస్ అని తెలిపారు. గత పదేండ్లలో కనీసం ఒక్క సమ్మె కూడా చేయాల్సిన అవసరం లేకుండా అన్ని పనులను, డిమాండ్లను సాధించుకున్నామన్నారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ గెలిపించాలని కోరారు.

You may also like

Leave a Comment