ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquer scam) కేసులో ఎమ్మెల్సీ కవితకు(MLC kavitha) మరోసారి చుక్కెదురైంది. ఆమె కస్టడీని మరోసారి పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో వారం రోజుల పాటు ఈడీ కస్టడీ (Custody)కి ఓకే చెప్పిన న్యాయస్థానం తాజాగా మరో మూడు రోజులు పొడగిస్తూ తీర్పు చెప్పింది. దీంతో బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు మరోసారి నిరాశే మిలిగింది.
అయితే, కవిత కస్టడీ పొడగింపునకు ముందు ఈడీ తరఫు న్యాయవాది కోర్టులో గట్టిగా తన వాదనలను వినిపించారు. కవిత తమ కుటుంబ సభ్యుల వ్యాపార వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. ఆమె మొబైల్‌లోని డేటాను సేకరించి విశ్లేషించాం. ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌తో కూడా సరిపోల్చి చూశాం.మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ అయ్యింది. ఆమె తన మేనల్లుడి వ్యాపార వివరాలు చెప్పాలని అడిగితే తెలియదని కవిత సమాధానం ఇచ్చారు.
సోదాల సందర్భంగా ఫోన్ సీజ్ చేసాం.కానీ, ఆ వ్యక్తి (కవిత మేనల్లుడు) విచారణకు హాజరుకాలేదు.మేము కోర్టులో మాట్లాడుతున్న టైంలో హైదరాబాద్‌లో సోదాలు జరుగుతున్నాయి. నేరపూరిత సొమ్మును కవిత తన మేనల్లుడి ద్వారా వినియోగించుకుంది. ఈ విషయంలో సమీర్ మహేంద్రుతో కలిసి ఆమెను విచారించడానికి అప్లికేషన్ దాఖలు చేశాము. మరో 5 రోజులు కవితను ఈడీ కస్టడీకి ఇవ్వండి కోరగా కోర్టు తీర్పు రిజ్వర్ చేసింది.
ఇక బెయిల్ పిటిషన్ కోసం కవిత తరఫు లాయర్లు సైతం కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. ఈడీ అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఆమె బయట లేరు.ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగిసాక బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని కోరుతున్నాం. బెయిల్ పిటిషన్ పై జవాబు ఇవ్వడానికి 5 రోజుల సమయం సరిపోతుంది. కవిత ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారు.వారితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వండి.చివరిసారి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని ఆమె తరఫు లాయర్లు వాదించగా తీర్పును సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జ్ కావేరి బవేజా రిజర్వు చేశారు.