మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులివ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) వ్యతిరేకించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విచారం వ్యక్తం చేశారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం చాలా మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లేనని తెలిపారు. ఈ మేరకు X(ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహిళా ఉద్యోగులకు రుతుక్రమ సమయంలో వేతనంతో కూడిన సెలవు ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు. రుతుస్రావం అనేది వైకల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని.. అందుకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వక్కర్లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుభూతి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని సెలవు మంజూరు చేయాల్సింది పోయి ఇలా కొట్టి పారేయడమనేది విచారం కలిగిందన్నారు. మహిళల పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని కవిత చెప్పారు.
నెలసరి మనకున్న ఆప్షన్ కాదని, అదొక సహజమాన జీవ ప్రక్రియ అని కవిత తెలిపారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అనేది మహిళల బాధను విస్మరించినట్లేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రుతుస్రావం అనేది ఛాయిస్ కాదు. అది ఒక బయలాజికల్ రియాలిటీ.. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొనే నిజమైన సవాళ్లు, ప్రతిదానికీ మనం ఎదుర్కోవాల్సిన పోరాటం పట్ల సానుభూతి లేకపోవటం విస్తుగొలిపే విషయం’ అని కవిత పేర్కొన్నారు.
Disheartened by the Union Minister of Women and Child Development Smriti Irani Ji’s dismissal of menstrual struggles in Rajya Sabha. As a woman, it's appalling to see such ignorance, for our struggles, our journeys isn’t a consolation, it deserves a level playing field and that’s… pic.twitter.com/vj9wbb0A4f
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023