రాజకీయ జీవితంతో తలమునకలవుతున్న నేతలు.. వారికి కాస్త విరామం దొరికిన టైమ్ లో లేదా ప్రచారంలో భాగంగా ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఫోన్ కెమెరాకు పనిచెబుతారు.. మనసుకు నచ్చిన దృశ్యాలను చిత్రించి ట్విట్టర్లో షేర్ చేసి అభిమానులను ఆనందపరుస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ( BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కూడా ఇలాగే ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు.

ప్రస్తుతం కవిత చేసిన ట్విట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మరోవైపు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు కూడా బిజిబిజీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి..