Telugu News » Hyderabad: హిందూవులపై మూక దాడి..!

Hyderabad: హిందూవులపై మూక దాడి..!

తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గంలో ముస్లిం యువకులు రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను, దాడి వీడియోలను హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ నీలం భార్గవ రామ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

by Ramu

హైదరాబాద్ (Hyderabad) లో హిందువు(Hindu)లపై ఇటీవల దాడులు ఎక్కువయ్యాయి. కావాలని రెచ్చగొట్టడం, దాడి చేయడం తరచూ జరుగుతున్నాయి. తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గంలో ముస్లిం యువకులు రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను, దాడి వీడియోలను హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ నీలం భార్గవ రామ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

ట్వీట్‌ లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం… కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్‌‌ లో గొడవ జరిగింది. పతంగుల దుకాణం వద్ద హిందూ దళిత విద్యార్థులతో ముస్లిం యువకులు గొడవ పడ్డారు. అనంతరం దళిత యువకులు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. అయితే.. వారిని ముస్లిం యువకులు బైక్ పై ఫాలో అయ్యారు. దళిత యువకుల ఇండ్లను గుర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత మూడు బైక్ లపై వచ్చిన ముస్లిం యువకులు.. దళిత యువకులపై దాడి చేశారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు దాడి చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు తిరగబడటంతో అక్కడి నుంచి వెళ్లిన ముస్లిం యువకులు తర్వాత మరికొంత మందిని తీసుకుని అక్కడికి వచ్చారు.

మహిళలు, పిల్లలు, పెద్దలు అని చూడకుండా ఇనుప రాడ్లతో ముస్లిం యువకులు దాడులు చేశారు. అంతటితో ఆగకుండా రాళ్లతో ఇండ్లపై దాడులు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లను కోరారు భార్గవ్ రామ్.

మరోవైపు, బీజేపీ మూసాపేట కార్పొరేటర్ మహేందర్, ఎన్ రతన్ కుమార్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment