Telugu News » Modi Global Leader Rating: ప్రధాని మోడీనే నెంబర్ వన్.. ప్రపంచంలోనే మరో అరుదైన ఘనత..!

Modi Global Leader Rating: ప్రధాని మోడీనే నెంబర్ వన్.. ప్రపంచంలోనే మరో అరుదైన ఘనత..!

ప్రధాని మోడీ మరోసారి ప్రపంచంలోనే నెంబర్ వన్‌ లీడర్‌గా స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారత్‌లో మోడీ నాయకత్వాన్ని 76 శాతం ప్రజలు హర్షిస్తుండగా, 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు మార్నింగ్ కన్సల్ట్(Morning Consult) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

by Mano
Modi Global Leader Rating: Prime Minister Modi is number one.. another rare honor in the world..!

భారత ప్రధానమంత్రి(PM) నరేంద్ర మోడీ(Modi) ఘనత విశ్వవ్యాప్తమైంది. మరోసారి ప్రపంచంలోనే నెంబర్ వన్‌ లీడర్‌గా స్థానాన్ని కైవసం చేసుకున్నారు మోడీ. అత్యధిక ప్రజామోదంగల నేతలపై నిర్వహించిన సర్వే.. ప్రధాని మోడీ ఖ్యాతి ఎంత గొప్పదో తెలియజేసింది. దేశ విదేశాల్లోని ప్రధానులపై ఈ సర్వేను నిర్వహించారు.

Modi Global Leader Rating: Prime Minister Modi is number one.. another rare honor in the world..!

 

భారత్‌లో మోడీ నాయకత్వాన్ని 76 శాతం ప్రజలు హర్షిస్తుండగా, 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు మార్నింగ్ కన్సల్ట్(Morning Consult) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మోడీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికోలో 66 శాతం మంది ప్రజలు ఆమోదిస్తుండగా, 29 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో పేర్కొంది.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వే 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు మరింత జోష్‌ను నింపనున్నాయి. ప్రధాని మోడీ అగ్రస్థానంలో ఉండటంపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు సర్వేల్లోనూ ప్రజామోదంలో ప్రధాని మోడీ ప్రథమ స్థానంలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోడీకి 84శాతం ప్రజామోదం లభించింది. ఆ తర్వాత కరోనా రెండో దశ విజృంభణ సమయంలో మాత్రం ఇది 63శాతానికి పడిపోయింది. గతేడాది మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసిన సర్వేలో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో మోడీ 71 శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. అప్పుడు కూడా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనెడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడోలకు 43 శాతం ప్రజామోదం లభించింది.

You may also like

Leave a Comment