రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్(RSS Chief) మోహన్ భగవత్(Mohan Bhagvat) గోహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవును వధించడానికి కసాయిని పంపేది హిందువులే అని అన్నారు. ప్రతీ ఒక్కరూ గో సేవ చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ పిలుపునిచ్చారు. భగవత్ ఉత్తరప్రదేశ్‌లోని మథురాలోని ఫరా ప్రాంతంలోని దీనదయాళ్ కామధేను గౌశల సమితి కార్యక్రమంలో ఆవుల పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు.
గోశాల సమితి రూ.200కోట్లతో దీనదయాళ్ కౌ సైన్స్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్మించింది. ఈ కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మధుర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవుల గురించి అనేక రకాల ప్రామాణికమైన పరిశోధనలను సేకరిస్తామని మోహన్ భగవత్ చెప్పారు.
బంగ్లాదేశ్‌లో అత్యధికంగా ఆవులను పెంచుతున్నారని తెలిపారు. అయితే వాటిని అక్కడికి ఎవరు పంపుతారనేది ప్రశ్నగా మిగిలిందన్నారు. ఈ ఆవులు హిందువుల ఇళ్ల నుంచి అక్కడికి చేరుకుంటాయని, వాటిని మోసే ప్రజలు కూడా హిందువులేనని భగవత్ వెల్లడించారు.
ఆవును మనం ఎప్పుడూ మనతోనే ఉంచుకోవాలని, చనిపోయిన తర్వాత దాని కొమ్ము, చర్మం కూడా మనకు ఉపయోగపడుతుందని భగవత్ చెప్పారు. గోవులు మృత్యువాత పడిన తర్వాత కూడా మనకు సేవ చేస్తుంటే అవి బతికుండగా మనం ఎందుకు సేవ చేయలేమన్నారు.