Telugu News » Warangal : కారులో మంటలు.. అగ్నికి ఆహుతి అయిన నోట్ల కట్టలు.. !!

Warangal : కారులో మంటలు.. అగ్నికి ఆహుతి అయిన నోట్ల కట్టలు.. !!

తెలంగాణ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇంకా నగదు పట్టుబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో అక్రమంగా కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల వేళ కోట్ల కొద్ది డబ్బు పట్టుబడుతుండటం సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పట్టుబడిన డబ్బుతో ఎందరో పేదల జీవితాలు.. నిరుద్యోగుల లైఫ్ లను సెటిల్ చేయవచ్చని విషయం తెలిసిన వారు అనుకుంటూ బాధపడుతున్నారు.. అదీగాక పోలీసులు చెక్ పాయింట్లు పెట్టి కట్టుదిట్టంగా భద్రత చర్యలు తీసుకుంటున్న డబ్బు అక్రమ రవాణా ఆగడం లేదు.

ఇప్పటికే నగరంతో పాటు.. తెలంగాణ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇంకా నగదు పట్టుబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో అక్రమంగా కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. అక్రమంగా డబ్బును తరలించడానికి ప్రయత్నించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో డబ్బులను అమర్చి వరంగల్ (Warangal) నుంచి వర్ధన్నపేట ( Vardhannapet) వైపు వెళ్తున్నారు. అక్కడ ఉన్న పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది.

కారు ఇంజన్ హిట్ ఎక్కి వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. బొల్లికుంట (Bollikunta) క్రాస్ రోడ్ వద్దకు రాగానే కారులో, మంటలతో పాటు దట్టమైన పొగలు రావడం మొదలైయ్యాయి.. దీంతో కారు అక్కడే నిలిపి డ్రైవర్​ పరారయ్యాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ సీన్ అంతా సినీ ఫక్కీలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోయింది.

కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ డబ్బు సుమారు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు ఉన్నట్లు పోలీసుల అంచనా.. మరోవైపు పోలీసులు ఈ డబ్బు ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు.

You may also like

Leave a Comment