Telugu News » Bharat: రిటైర్ అయిన తరువాత భారత్ వైపే చూపు!

Bharat: రిటైర్ అయిన తరువాత భారత్ వైపే చూపు!

ఎంతైనా కన్నతల్లిని, పుట్టిన ఊరిని ఎవరూ మరవలేరు కదా

by Sai
most of the nri s came back to india after retairment

భారత దేశం(Bharat) నుంచి పెద్ద పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేయడానికి విదేశాల్లో స్థిరపడిన వారంతా కూడా జీవితం చివరి దశలో తిరిగి తమ మాతృదేశమైన భారత్‌ కే రావాలనుకుంటున్నారని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. రిటైర్ అయిన తరువాత ప్రశాంత జీవనం గడపాలి అంటే మాత్రం దానికి సరైన ప్లేస్ అంటే భారత్‌ అనే అంటున్నారు చాలా మంది ఎన్ఆర్ఐ(Nri)లు.

most of the nri s came back to india after retairment

దాదాపు 60 శాతం మంది అమెరికా(US), ఆస్ట్రేలియా(Australia), యూకే(Uk), కెనడా(Canada), సింగపూర్, లండన్ లో నివసించే వారందరూ కూడా తమ ఉద్యోగ జీవితాలకు రెస్ట్‌ ఇచ్చేసి ఆనందంగా, సంతోషంగా గడపడానికి భారత్ కి వచ్చేయాలనుకుంటున్నారు. ఆస్ట్రేలియా ల నివసించే 80 శాతం మంది, సింగపూర్ నుంచి 80 శాతం మంది, అమెరికా నుంచి 75 శాతం మంది, యూకే నుంచి 70 శాతం మంది, కెనడా నుంచి 63 శాతం మంది భారతీయులు తమ పదవీ విరమణ తరువాత భారత్ కి వచ్చేయడానికి రెడీగా ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి.

అసలు వీరంతా కూడా తిరిగి భారత్‌ కు ఎందుకు రావాలి అనుకుంటున్నారంటే..కొందరు ఆర్థిక కారణాలను చెబుతుంటే..కొందరు బంధుత్వాలు, బంధాల గురించి చెబుతున్నారు. ఈ క్రమంలో 72శాతం మంది భారత్ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. భారత్‌లో నే పుట్టి పెరిగినవారు కొందరు తమ దేశం మీద మమతతోనే తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు.

చిన్న నాటి జ్ఙాపకాలను, స్నేహితులను, తమ సంస్కృతి సంప్రదాయాలను విడిచి ఉండలేక, మరిచిపోలేక ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొంత మంది అయితే వారి రానున్న తరాల వారికి భారతీయ సంస్కృతిని, సంప్రదాయలను చూపడానికి వారికి నేర్పించడానికి భారత్‌ కు వచ్చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి సంవత్సరం భారత్‌ నుంచి విదేశాలకు కొన్ని వేల మంది ఉద్యోగాల కోసం, చదువు, వ్యాపారాల నిమిత్తం వెళ్తున్నారు.

వారంతా కూడా రిటైర్ అయిన తరువాత తిరిగి భారత్ కే చేరుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎంతైనా కన్నతల్లిని, పుట్టిన ఊరిని ఎవరూ మరవలేరు కదా

You may also like

Leave a Comment