Telugu News » Aravind : కేసీఆర్ ది నయాపైసా లేదు!?

Aravind : కేసీఆర్ ది నయాపైసా లేదు!?

కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అరవింద్ స్పందించారు. రాష్ట్రంలో ప్రారంభించిన మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని అన్నారు.

by admin
mp-aravind

– మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారం
– కేంద్రం డబ్బులు ఇచ్చింది నిజం కాదా?
– రూ.332.3 కోట్ల గ్రాంట్ సంగతేంటి?
– ఉస్మానియా నూతన బిల్డింగ్ ఏమైంది?
– ఎంపీ అరవింద్ ప్రశ్నలు

తెలంగాణ (Telangana) లో కొత్తగా మరో 9 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ప్ర‌గ‌తి భ‌వ‌న్ (Pragati Bhavan) నుంచి వ‌ర్చువ‌ల్ గా సీఎం కేసీఆర్ (CM KCR) వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టమని అన్నారు. అయితే.. సిరిసిల్లలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ (KTR) కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ (PM Modi) సహకరించకపోయినా.. మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నామని అన్నారు.

mp-aravind

కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అరవింద్ (MP Aravind) స్పందించారు. రాష్ట్రంలో ప్రారంభించిన మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని అన్నారు. డాక్టర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని తెలిపారు. 332.3 కోట్ల రూపాయల గ్రాంట్ ను కేంద్రం ఇచ్చిందని.. వాటితోనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నిర్మించిందని అన్నారు. దీనికి తాము కట్టినట్టుగా చంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలల్లో కేసీఆర్ ది నయా పైసా లేదని అన్నారు అరవింద్. దమ్ముంటే మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ పై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య రంగంపై అంత ప్రేమ ఉంటే.. ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు దొంగ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. పైగా, ఏ ముఖం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదని చెబుతారని మండిపడ్డారు అరవింద్.

You may also like

Leave a Comment