నిజామాబాద్ (Nizamabad) ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. దేశాన్ని విభజన చేసిన దేశ ద్రోహి పార్టీగా పేర్కొన్నారు.. పదవుల కోసం నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లతున్నారని మండిపడ్డారు.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తీసేస్తం, త్రిబుల్ తలక్ తెస్తాం అంటు మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు..
అసలు వక్స్ బోర్డు ఎందుకని ప్రశ్నించిన ఆయన దాన్ని తీసేయాలన్నారు.. అందరికీ మేలు చేసేలా ఉన్న సీఏఏ (CAA)ను కాంగ్రెస్ (Congress) నేతలు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్న ఎంపీ.. వారి ప్రభుత్వ హయాంలో పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.. దేశంలో ఒకే చట్టం ఉండాలి.. కానీ దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు.. రాజ్యాంగ లో సెక్యులర్ పధం ఎందుకు పెట్టారన్నారు..
అలాగే మథుర లో శ్రీకృష్ణుని జన్మస్థలం లో దర్గా ఎందుకు కట్టారని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.. 70 సంవత్సరాలు దేశాన్ని ఏలి ఏం చేశారని అరవింద్ విరుచుకుపడ్డారు.. అధికారం దక్కించుకోవడాని ఆరు గ్యారంటీ లు ఇచ్చారు. అవి ఏమైనవని ప్రశ్నించారు.. ఇస్లాం దేశాలు ఒకరిని మించి ఒకరు హిందు దేవాలయాలు కడుతున్నారని తెలిపిన ఎంపీ.. అబుదాబి కింగ్ రాముని గుడి కట్టారని గుర్తు చేశారు..
మనమందరం జై శ్రీ రామ్ అంటున్నాము కానీ ఇస్లాం రాజు జయశ్రీరాం అంటున్నారని.. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం దేవునివైపు చూడటం లేదని విమర్శించారు.. రేవంత్ రెడ్డి కి లోపల హిందుత్వం ఉంది కానీ పదవి కోసం ఏం చేయలేక పోతున్నారని అరవింద్ ఆరోపించారు.. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఎజెండానే లేదని విమర్శించిన ఆయన.. అందుకే ప్రజలకు ఏం చేస్తామో, ఏమి హామీ ఇస్తారో చెప్పట్లేదన్నారు..