వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)లో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ(Narasaraopeta MP) కృష్ణదేవరాయలు(Krishna Devarayalu) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
తాను సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మాట వాస్తవమేనన్నారు. ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ తనను కోరారని ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
తాను పుట్టి పెరిగింది గుంటూరులో అయినప్పటికీ ఐదేళ్లుగా పల్నాడులో చాలా పనులు చేశానని, చాలా నిధులు తీసుకొచ్చానని తెలిపారు. చేపట్టిన ప్రాజెక్టులన్నీ సగం సగం మిగిలిపోయాయని తెలిపారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
అధిష్టానం లెక్కలు అధిష్టానానికి ఉంటే, తన ఆలోచనలు వేరుగా ఉన్నాయని ఎంపీ తెలిపారు. మొత్తంగా వేరే ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని తెలిపారు.