ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ (Sanjay Singh)ను ఈడీ గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో తన రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సంజయ్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. కాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఆయనను ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని ఈడీని ప్రశ్నించింది. ఈమేరకు సంజయ్ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ.. మనీలాండరింగ్ నిర్ధారణ కాలేదు.. మనీ ట్రయల్ కూడా కనుగొనబడలేదని తెలిపారు.
అదేవిధంగా సంజయ్ వద్ద ఎలాంటి నగదు లభించలేదని, ఆయనపై రూ.2 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయవచ్చని ఎంపీ తరపు న్యాయవాది విన్నవించిన వాదనను సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం అంగీకరించింది. ఈ క్రమంలో సంజయ్ పై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనవచ్చని వెల్లడించింది.