ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ (Reliance Industries chairman) ముఖేష్ అంబానీ(Mukhesh Ambani)కి బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. ఇదివరకే ఆయనకు చాలాసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా అంబానీ అధికారిక ఈ-మెయిల్ ఐడీకి బెదిరింపు మెసేజ్ వచ్చింది.
ఈ-మెయిల్ పంపిన వ్యక్తి అందులో.. తనకు భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు పరిచయంలో ఉన్నారని పేర్కొన్నాడు. రూ.20కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు. అంబానీ ఐడీకి బెదిరింపు ఈ-మెయిల్ అక్టోబర్ 27న వచ్చింది. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌చార్జి ముంబైలోని గామేవి పోలీస్ స్టేషన్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సెక్యూరిటీ ఇన్‌చార్జి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. ‘మాకు రూ.20కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తాం. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు’ అని బెదిరింపు ఇమెయిల్‌లో రాసుకొచ్చారు.
ఈ-మెయిల్‌ను స్వీకరించిన తర్వాత, ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌చార్జి ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు వివిధ సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ-మెయిల్ పంపబడిన ఐపీ అడ్రస్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.