Telugu News » Mukkoti Ekadasi: ముక్కోటి ఏకాదశి శోభ.. ఉత్తర ద్వార దర్శనానికి క్యూ..!

Mukkoti Ekadasi: ముక్కోటి ఏకాదశి శోభ.. ఉత్తర ద్వార దర్శనానికి క్యూ..!

తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనాల(Uttara Dwara Darshanam) కోసం తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద బారులుతీరారు.

by Mano
Mukkoti Ekadasi: The splendor of Mukkoti Ekadasi.. Queue to visit the Northern Gate..!

ముక్కోటి ఏకాదశి(Mukkoti Ekeadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనాల(Uttara Dwara Darshanam) కోసం తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద బారులుతీరారు.

Mukkoti Ekadasi: The splendor of Mukkoti Ekadasi.. Queue to visit the Northern Gate..!

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. తిరుమలలో నేటి ఉదయం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు భారీగా తరలివచ్చారు.

ఇక, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు.

భద్రాద్రి శ్రీరాముడి దర్శనానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. అదేవిధంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారు జామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం చేశారు. ఉదయం 5గంటల నుంచి భక్తులకు ఆలయాధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు.

You may also like

Leave a Comment