Telugu News » Mumbai: ఇండియా గేట్ సమీపంలో బోట్‌ కలకలం.. పోలీసుల అదుపులో ముగ్గురు..!

Mumbai: ఇండియా గేట్ సమీపంలో బోట్‌ కలకలం.. పోలీసుల అదుపులో ముగ్గురు..!

అరేబియా సముద్రంలో అనుమానాస్పద బోటు కలకలం సృష్టించింది. ముంబై(Mumbai)లోని గేట్‌వే ఆఫ్ ఇండియా(Gateway of India) సమీపంలో సముద్ర గస్తీ పోలీసులు బోటును స్వాధీనం చేసుకున్నారు.

by Mano
Mumbai: Boat mishap near India Gate.. Three in police custody..!

అరేబియా సముద్రంలో అనుమానాస్పద బోటు కలకలం సృష్టించింది. ముంబై(Mumbai)లోని గేట్‌వే ఆఫ్ ఇండియా(Gateway of India) సమీపంలో సముద్ర గస్తీ పోలీసులు వేగంగా స్పందించి బోటును స్వాధీనం చేసుకున్నారు. సముద్ర గస్తీని తప్పించుకొని ఆ బోటు కువైట్ బోట్ గేట్‌వే ఆఫ్ ఇండియాకు ఎలా చేరిందనేది చర్చనీయాంశంగా మారింది.

Mumbai: Boat mishap near India Gate.. Three in police custody..!

గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవ కనిపించడం 26/11 ఉగ్రదాడిని గుర్తుచేస్తోంది. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీసుల సంయుక్త బృందం విచారణ చేపట్టింది. తమిళనాడు పోలీసుల ద్వారా ముగ్గురిని విచారిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై బీచ్‌కు కొద్దిదూరంలో భారత జలాల్లోకి అనుమానాస్పద బోట్‌ ప్రవేశించినట్లుగా వాచ్ టవర్ పేర్కొంది. దీంతో ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం పడవను అడ్డుకుని ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కొలాబా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులు కువైట్ సరిహద్దును ఎలా దాటారు? ముంబై అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన సాసూన్ డాక్ కాంప్లెక్స్‌కు చేరుకునేందుకు పడవలో ఎలా వెళ్లారు? దక్షిణ భారత సముద్ర తీరానికి వెళ్లకుండా గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎందుకు వచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

You may also like

Leave a Comment